సీమ నేపధ్యంలో గాని యాసలో గాని వచ్చే సినిమాలకు చాలా మంచి క్రేజ్ ఉంటుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలు అనగానే ఫ్యాక్షనిజం,కత్తులు..పగలు ,ప్రతీకారాలు ఇవే గుర్తొస్తాయి. ప్రతీకారాలు, గొడవలు, రక్తపాతం వంటివి మన దర్శకులు సరిగా తీస్తే ఆ సినిమాకి క్రేజ్ ఒక లెవెల్ లో ఉంటుంది. కానీ సినిమాల్లో చూపించేది నిజం కాదు అని రాయలసీమ వాసులు కొట్టిపడేస్తుంటారు. సీమ ప్రేమకు పెట్టింది పేరు. ఎక్కడ తక్కువ కాకుండా అథితులకు ఇచ్చే మర్యాదలు చెప్పనర్లేదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ప్రేమకథలు కూడా మిగతా లవ్ స్టోరీస్ కంటే డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పటివరకు దాదాపు తెలుగులో అందరు హీరోలు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సినిమాలు చేసి మంచి సక్సెస్లు అందుకున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ వచ్చిన టాప్ 10 మూవీస్ గురించి చూద్దాం
‘సమర సింహారెడ్డి’ చిత్రం 13 జనవరి 1999న సంక్రాంతి కానుకగా విడుదలై ఇండస్ట్రీ రికార్డ్స్ను నెలకొల్పింది 1999వ సంవత్సరంలో దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వం వహించిన “సమరసింహా రెడ్డి” చిత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు రికార్డులను సృష్టించింది. బాలయ్య బాబు సరసన అంజలా జవేరి, సిమ్రాన్ హీరోయిన్లుగా నటించారు.అయితే అప్పట్లో ఈ చిత్రం బాలయ్య బాబు కెరీర్ లోనే మంచి హిట్ గా నిలిచింది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ చిత్రం బిసి సెంటర్లలో 100 రోజులకు పైగా ఆడి కలెక్షన్ల సునామి సృష్టించింది. ‘సమరసింహారెడ్డి’ మూవీ మాత్రం ఈ జానర్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. సమరసింహారెడ్డి’ చిత్రం మూడు టాకీస్లలో 227 రోజులు నడిచింది. 29 కేంద్రాల్లో 175 రోజులతో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. 122 కేంద్రాల్లో 50 రోజులు.. 73 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుని ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన టాప్ 10 సినిమాలు-సమరసింహారెడ్డి/top-listing/samara-simha-reddy-to-veera-simha-reddy-telugu-movies-made-in-the-backdrop-of-rayala-seema-factionism-6-2199.html#samarasimha-reddy
2
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో 2002 లో వచ్చిన ఇంద్ర సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. చిరంజీవి, ఆర్తి అగర్వల్, సోనాలి బింద్రె, ప్రకాష్ రాజ్, ముకెష్ రిషి, తనికెళ్ళ భరణి, పునీత్ ఇస్సర్, బ్రహ్మానందం, శివాజి, ధర్మవరపు సుబ్రమాణ్యం, ఎ వి ఎస్, ఎమ్ ఎస్ నారాయణ, మాస్టర్ తేజా తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బి గోపాల్ నిర్వహించారు మరియు నిర్మాత అశ్విని దత్త్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు. అప్పట్లో 10 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. మొత్తానికి 40 కోట్లకు పైగానే సంపాదించి ఆ టైమ్ కి ఈ స్థాయిలో డబ్బు సంపాదించిన మొదటి సౌత్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డ్ కొట్టింది. సినిమా సక్సెస్ చూసిన ఇతర భాషల పరిశ్రమలు.. ఇంద్రాని తమ తమ భాషల్లోకి అనువదించుకున్నాయి. హిందీలో ఇంద్ర : ది టైగర్ గా, తమిళ్ లో ఇందిరన్ గా, భోజ్ పురిలో ఏక్ షేర్ గా డబ్ అయి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన టాప్ 10 సినిమాలు-ఇంద్ర/top-listing/samara-simha-reddy-to-veera-simha-reddy-telugu-movies-made-in-the-backdrop-of-rayala-seema-factionism-6-2199.html#indra
3
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా ఆది 2002 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించగా మాస్ హిట్ గా నిలిచింది. సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా హీరోయిన్ కీర్తి చావ్లా నటించింది. మణిశర్మ సాంగ్స్, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ ఆది సినిమాకు మరింత ఆకర్షణ చేకూర్చాయి. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా.. అనే డైలాగ్ అప్పట్లో పిచ్చ ఫేమస్. ఆది విజయం ఎన్టీఆర్ కి మాస్ హీరో హోదా తెచ్చిపెట్టింది. ఈ సినిమా విడుదలయ్యే నాటికి ఎన్టీఆర్ వయసు కేవలం 19ఏళ్లు మాత్రమే. తక్కువ వయసులోనే భారీ ఇమేజ్ ఎన్టీఆర్ ఈ చిత్రంతో సొంతం చేసుకున్నాడు.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన టాప్ 10 సినిమాలు-ఆది/top-listing/samara-simha-reddy-to-veera-simha-reddy-telugu-movies-made-in-the-backdrop-of-rayala-seema-factionism-6-2199.html#aadi
4
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యన్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన జయం మనదేరా అక్టోబర్ 7న 2000 విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో వెంకటేశ్ తండ్రీకొడుకులు గా ద్విపాత్రాభినయం చేశారు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ యాక్షన్ రివెంజ్ డ్రామా లో సౌందర్య . భానుప్రియ, మీనాకుమారి, జయప్రకాశ్ రెడ్డి, రమాప్రభ, యల్.బీ శ్రీరామ్, తణికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు సినీ ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించాయి. మహదేవనాయుడిగానూ, రుద్రమనాయుడిగానూ తండ్రీ కొడుకులు గా ద్విపాత్రాభినయం చేసిన వెంకీ అభినయం ఆకట్టుకుంటుంది.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన టాప్ 10 సినిమాలు-జయంమనదేరా/top-listing/samara-simha-reddy-to-veera-simha-reddy-telugu-movies-made-in-the-backdrop-of-rayala-seema-factionism-6-2199.html#jayam-manade-raa
5
మహేష్బాబు కెరీర్లో ఒక్కడు సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. హీరోగా అతడి ఇమేజ్, స్టార్డమ్ను రెట్టింపు చేసిన సినిమాల్లో ఒక్కడు ఒకటి. కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఒక్కడు సినిమా మహేశ్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్..ఈ సినిమాలో కబడ్డి ప్లేయర్ గా మహేశ్ నటించాడు. మహేశ్ కి జోడిగా భూమిక, ప్రతినాయక పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించారు. ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీగా దర్శకుడు గుణశేఖర్ ఈసినిమాను తెరకెక్కించాడు. ఇందులో కబడ్డీ ప్లేయర్గా మహేష్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అభిమానులను అలరించాయి. 2003 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం కమర్షియల్గా పెద్ద హిట్గా నిలిచింది.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన టాప్ 10 సినిమాలు-ఒక్కడు/top-listing/samara-simha-reddy-to-veera-simha-reddy-telugu-movies-made-in-the-backdrop-of-rayala-seema-factionism-6-2199.html#okkadu
6
1997, మే 9న రిలీజైన ప్రేమించుకుందాం రా టాలీవుడ్ లో చరిత్ర సృష్టించింది. ఫ్యాక్షన్ కథకు లవ్ స్టోరీ యాడ్ చేసి తీసిన ఈ సినిమా ఆ తర్వాత ఎన్నో సినిమాలకు స్ఫూర్తిగా నిలిచింది. వెంకటేష్ సరసన అంజలా జవేరి హీరోయిన్ గా నటించగా, జయప్రకాశ్ రెడ్డి, శ్రీహరి విలన్ లుగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. మ్యూజిక్ పరంగా మంచిపేరు తీసుకొచ్చింది. ఇప్పటికి లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ చూసినా, పాటలు విన్నా గతంలోకి వెళ్లిపోతుంటారు ఎందరో ప్రేమికులు..ప్రతినాయకుడి పాత్రలో నటించిన జయప్రకాశ్ రెడ్డికి చాలా పేరు తీసుకొచ్చింది.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన టాప్ 10 సినిమాలు-ప్రేమించుకుందాం...రా/top-listing/samara-simha-reddy-to-veera-simha-reddy-telugu-movies-made-in-the-backdrop-of-rayala-seema-factionism-6-2199.html#preminchukundam-raa
7
రాయలసీమ రామన్న చౌదరి 15 సెప్టెంబరు 2000లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడులైంది. మోహన్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత హిట్ కాకపోయినా సినిమాకు వచ్చిన స్పందన మాత్రం బాగా హైప్ క్రియేట్ చేసింది. జయసుధ, చంద్ర మోహన్, అనంద్ రాజ్, ప్రియా గిల్లి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేష్ కృష్ణ నిర్వహించారు మరియు నిర్మాత డా మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చరు.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన టాప్ 10 సినిమాలు-రాయల సీమ రామన్న చౌదరి/top-listing/samara-simha-reddy-to-veera-simha-reddy-telugu-movies-made-in-the-backdrop-of-rayala-seema-factionism-6-2199.html#rayalaseema-ramanna-chowdary
8
ప్రతీకారాలు, గొడవలు, అథితులకు ఇచ్చే మర్యాదలు రాయలసీమలో ఓ రేంజ్ లో ఉంటాయనడానికి ఒక ఉదాహరణ మర్యాదరామన్న సినిమా. రాజమౌలి దర్శకత్వంలో సునీల్,సలోని, నాగినీడు, బ్రహ్మాజి, రావు రమేష్, సుప్రీత్, వేణు గోపాల్, ప్రభాకర్ తదితరులు నటించారు. ఈ సినిమాలో శతృవు ఇంట్లో చిక్కుకుపోయి, ఆ ఇంటి అమ్మాయినే ప్రేమించే పాత్రలో సునీల్ నటించాడు..చివరిక ఎలా వారి ప్రేమను నమ్మకాన్ని గెలిచాడు అనేది స్టోరీ.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన టాప్ 10 సినిమాలు-మర్యాద రామన్న/top-listing/samara-simha-reddy-to-veera-simha-reddy-telugu-movies-made-in-the-backdrop-of-rayala-seema-factionism-6-2199.html#maryada-ramanna
9
ఎన్టీయార్,పూజాహెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అరవింద సమేత..ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా వచ్చిన ఒక యువకుడు, సీమలో ఫ్యాక్షనిజాన్ని ఎలా రూపుమాపాడు. అతన్ని ప్రేమించిన అరవింద కథ అరవింద సమేత వీరరాఘవ. జునియర్ ఎన్టీఆర్, పూజ హెగ్డే, సునిల్, జగపతి బాబు, ఈషా రెబ్బా, నాగేంద్ర బాబు, శత్రు, రావు రమేష్, రవి ప్రకాష్, సితార తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ వహించారు మరియు నిర్మాత కె రాధాకృష్ణన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ స్వరాలు అందించారు.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన టాప్ 10 సినిమాలు-అరవింద సమేత వీరరాఘవ/top-listing/samara-simha-reddy-to-veera-simha-reddy-telugu-movies-made-in-the-backdrop-of-rayala-seema-factionism-6-2199.html#aravindha-sametha
10
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ దొరికితే ఇక బాలయ్యను పట్టుకోలేం. ఇప్పటికే సమరసింహా రెడ్డి, నరసింహ నాయిడు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చి ఎలాంటి సూపర్ హిట్స్ అందుకున్నాయో మనకు తెలిసిందే. బాలయ్య ఈసారి వీరసింహారెడ్డిగా 2023 లో సంక్రాంతి కానుకగా వచ్చి మరోసారి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా బాలయ్య సినీ కెరీర్లో ఓ అరుదైన రికార్డ్ను క్రియేట్ చేసి వావ్ అనిపించింది. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోస్, లాల్, చంద్రిక రవి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోపిచంద్ మలినేని వహించారు. నిర్మాతలు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి నిర్మించారు. సంగీతం థమన్ ఎస్ అందించారు.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన టాప్ 10 సినిమాలు-వీర సింహా రెడ్డి/top-listing/samara-simha-reddy-to-veera-simha-reddy-telugu-movies-made-in-the-backdrop-of-rayala-seema-factionism-6-2199.html#veera-simha-reddy
Disclaimer
The images featured on this page are sourced from publicly available platforms, official press releases, and promotional materials. These images are published strictly for editorial, informational, and news reporting purposes under the principles of fair use.
We do not claim ownership of any images unless explicitly stated. All image copyrights belong to their respective photographers, production houses, or copyright holders.
If you are the rightful owner of any image and believe that its use on this website is unauthorized or objectionable, please contact us ([email protected]) with proper details. We will promptly review and remove the content if required.