భారతీయ సినిమా పరిశ్రమలో తెలుగు సినిమా పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 90 ఏళ్ల చరిత్ర కలిగిన టాలీవుడ్లో ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో సినిమాలు తెరకెక్కుతూ బాలీవుడ్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ సినీ ఇండస్ట్రీగా తన సత్తా చాటుతోంది. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఎన్నో గర్వించ దగ్గ సినిమాలు వచ్చాయి. అందులో దేశభక్తిని పెంపొందించే సినిమాలు ఎన్నో తెరకెక్కి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి.
1974లో రూపొందిన ‘అల్లూరి సీతారామరాజు' చిత్రం ప్రముఖ స్వాంతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తెరకెక్కించారు. బ్రిటిష్ పాలకుల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు సీతారామరాజు. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ నటించిన 100వ సినిమా ఇది. ఈ చిత్రంలో ఆయన టైటిల్ రోల్ చేసి. ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
കൂടുതല് കാണാം
దేశభక్తిని ఆవిష్కరించిన అత్యుత్తమ తెలుగు సినిమాలు-అల్లూరి సీతారామ రాజు/top-listing/best-patriotic-movies-in-telugu-6-160.html#alluri-seetarama-raju
2
బొబ్బిలి పులి 1982 లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం. దాసరి నారాయణరావు దర్వకత్వం వహించిన ఈచిత్రంలో ఎన్టీఆర్, శ్రీదేవి, మురళీమోహన్, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, జయచిత్రం ప్రభాకర్ రెడ్డి, అల్లురామలింగయ్య, ప్రసాద బాబు ముఖ్య తారాగణం.
കൂടുതല് കാണാം
దేశభక్తిని ఆవిష్కరించిన అత్యుత్తమ తెలుగు సినిమాలు-బొబ్బిలి పులి/top-listing/best-patriotic-movies-in-telugu-6-160.html#bobbili-puli
3
సర్దార్ పాపారావయుడు ఎన్.టి.రామారావు నటించిన సినిమాలలో ఇది ఒక ప్రఖ్యాతమైనది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1980వ దశకం మొదట్లో నిర్మించిన ఈ చిత్రంలో రామారావు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం ధరించి ప్రేక్షకులను అలరించాడు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈచిత్రంలో ఎన్టీఆర్, శ్రీదేవి, శారద ముఖ్య తారాగణం, శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. చక్రవర్తి సంగీతం అందించారు.
കൂടുതല് കാണാം
దేశభక్తిని ఆవిష్కరించిన అత్యుత్తమ తెలుగు సినిమాలు-సర్ధార్ పాపారాయుడు/top-listing/best-patriotic-movies-in-telugu-6-160.html#sardar-paparaidu
4
ఎన్టీఆర్, జయసుద, జమున కథానాయికలుగా 1982లో వచ్చిన సినిమా ‘నాదేశం'. యువ అనాధ చుట్టూ తిరిగే యాక్షన్ డ్రామా. ఈ చిత్రానికి కె.బాపయ్య దర్శకత్వం వహించారు. శ్రీ లలితా మూవీస్ సంస్థ ఈచిత్రాన్ని తెరకెక్కించింది. చక్రవర్తి సంగీతం అందించారు.
കൂടുതല് കാണാം
దేశభక్తిని ఆవిష్కరించిన అత్యుత్తమ తెలుగు సినిమాలు-నా దేశం/top-listing/best-patriotic-movies-in-telugu-6-160.html#naa-desam
5
మేజర్ చంద్రకాంత్ సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఎన్ టి రామా రావు, మోహన్ బాబు, నగ్మ, రమ్యా క్రిష్ణా, అమ్రిష్ పూరి, శారదా, సాయి కుమార్, శ్రీహరి, బ్రహ్మానందం, పరుచూరి గోపాలక్రిష్ణా తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె రాఘవేంద్ర రావు నిర్వహించారు మరియు నిర్మాత మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.
കൂടുതല് കാണാം
దేశభక్తిని ఆవిష్కరించిన అత్యుత్తమ తెలుగు సినిమాలు-మేజర్ చంద్రకాంత్/top-listing/best-patriotic-movies-in-telugu-6-160.html#major-chandrakanth
6
ఖడ్గం కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం మరియు 2002 లో విడుదలైంది. ఖడ్గం దేశభక్తితో కూడిన చిత్రం మరియు దాని ప్రేరణ కథకు అనేక అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రవితేజ, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో నటించారు.
കൂടുതല് കാണാം
దేశభక్తిని ఆవిష్కరించిన అత్యుత్తమ తెలుగు సినిమాలు-ఖడ్గం/top-listing/best-patriotic-movies-in-telugu-6-160.html#khadgam
7
మహాత్మ శ్రీకాంత్ హీరోగా రూపొందిన పొలిటికల్ డ్రామా చిత్రం మహాత్మ. ఒక వీధి రౌడీ గాందీ మార్గంలో ప్రయాణించి ఎలా మంచి వాడయ్యాడు అనే అంశాన్ని దర్శకుడు కృష్ణ వంశీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. 2009లో ఈచిత్రం విడుదలైంది.
കൂടുതല് കാണാം
దేశభక్తిని ఆవిష్కరించిన అత్యుత్తమ తెలుగు సినిమాలు-మహత్మ/top-listing/best-patriotic-movies-in-telugu-6-160.html#mahatma
8
పరమ వీర చక్రం 2011 లో విడుదలైన తెలుగు యుద్ధ నాటక చిత్రం, నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్, నేహా ధూపియా, షీలా ప్రధాన పాత్రల్లో నటించిన దాసరి నారాయణరావు రచన మరియు దర్శకత్వం. ఈ చిత్రం దేశభక్తిని ప్రతిబింబిస్తుంది మరియు నేషనల్ ఇంటిగ్రేషన్ స్ఫూర్తిని కలిగి ఉన్నందుకు సరోజిని దేవి అవార్డును గెలుచుకుంది.
കൂടുതല് കാണാം
దేశభక్తిని ఆవిష్కరించిన అత్యుత్తమ తెలుగు సినిమాలు-పరమవీర చక్ర/top-listing/best-patriotic-movies-in-telugu-6-160.html#parama-veera-chakra
9
మారో ప్రపంచం 1970 లో అదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన తెలుగు నాటక చిత్రం, సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు మరియు జమున ప్రధాన పాత్రల్లో నటించారు. చలనచిత్రంలో ఒక విప్లవాత్మక సమూహం ఒక ఆదర్శధామ ప్రపంచాన్ని సృష్టించమని పిలుస్తుంది.
കൂടുതല് കാണാം
దేశభక్తిని ఆవిష్కరించిన అత్యుత్తమ తెలుగు సినిమాలు-మరో ప్రపంచం/top-listing/best-patriotic-movies-in-telugu-6-160.html#maro-prapancham
10
భారతీయుడు ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయంలో నటించాడు. ఒక స్వాంతంత్ర సమరయోధుడు దేశంలో పెరిగిపోయిన లంచగొండితనాన్ని అరికట్టేందుకు ఏం చేసాడు అనేది కథాంశం. కమల్ హాసన్ సరసన మనీషా కొయిరాలా, ఊర్మిలా, సుకన్య నటించారు. ఈ సినిమాకి సంగీతం ఎ ఆర్ రెహమాన్ అందించారు.
കൂടുതല് കാണാം
దేశభక్తిని ఆవిష్కరించిన అత్యుత్తమ తెలుగు సినిమాలు-భారతీయుడు/top-listing/best-patriotic-movies-in-telugu-6-160.html#bharateeyudu
11
ఠాగూర్ 2003 లో విడుదలైన వివి వినాయక్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం. ఇది క్రైమ్-డ్రామా చిత్రం మరియు 2002 లో విడుదలైన తమిళ చిత్రం రమణ యొక్క రీమేక్. చిరంజీవి, శ్రియ శరణ్ మరియు జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం మరియు అవినీతి నిరోధక టాస్క్ఫోర్స్ను అవినీతిపరుడైన వ్యక్తిని నిర్మూలించడానికి మరియు సమాజంలోని సామాజిక వ్యతిరేక అంశాలను శుభ్రపరిచే పని కోసం చేసిన కథ.
കൂടുതല് കാണാം
దేశభక్తిని ఆవిష్కరించిన అత్యుత్తమ తెలుగు సినిమాలు-ఠాగూర్/top-listing/best-patriotic-movies-in-telugu-6-160.html#tagore
12
సుబాష్ చంద్రబోస్ 2005 లో విడుదలైన తెలుగు చిత్రం. ఇది ఒక చారిత్రక నాటక చిత్రం మరియు దేశభక్తిని దాని కథాంశంలో ప్రతిబింబిస్తుంది మరియు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. వెంకటేష్, శ్రియా శరణ్, జెనెలియా డిసౌజా ప్రధాన పాత్రలు పోషించారు.
കൂടുതല് കാണാം
దేశభక్తిని ఆవిష్కరించిన అత్యుత్తమ తెలుగు సినిమాలు-సుభాష్ చంద్రబోస్/top-listing/best-patriotic-movies-in-telugu-6-160.html#subash-chandra-bose
13
స్వాతంత్య ఉద్యమ స్పూర్తికి నిదర్శనంగా నిలిచే చిత్రాల్లో ఈ తరానికి బాగా చేరువైన చిత్రం రాజన్న అని చెప్పచ్చు.. అక్కినేని నాగార్జున, స్నేహ, బేబి ఆనీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో స్వతంత్ర్యం రాక ముందు తెలంగాణలో ఉన్న దొరల పాలన, అప్పటి పరిస్థితులను స్పష్టంగా కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు.
കൂടുതല് കാണാം
దేశభక్తిని ఆవిష్కరించిన అత్యుత్తమ తెలుగు సినిమాలు-రాజన్న/top-listing/best-patriotic-movies-in-telugu-6-160.html#rajanna
14
ఘాజీ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ ఇది 1971లో మునిగిపోయిన పాకిస్థాన్ సబ్ మైరైన్ కథతో తెరకెక్కించారు ఇందులో నేవీ ఆఫీసర్ పాత్రలో రానా దగ్గుబాటి ఇంకా తాప్సీ పన్ను, కె కె మీనన్, అతుల్ కులకర్ణి, ఓంపురి, నాజర్, సత్యదేవ్, భరత్ రెడ్డి రాహుల్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సంకల్ప్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు "కె" స్వరాలు సమకుర్చరు.
കൂടുതല് കാണാം
దేశభక్తిని ఆవిష్కరించిన అత్యుత్తమ తెలుగు సినిమాలు-ఘాజీ/top-listing/best-patriotic-movies-in-telugu-6-160.html#ghazi
15
మేజర్ సినిమా 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ ఇన్స్పిరేషన్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో అడవి శేష్, శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్,రేవతి, తదితరులు నటించారు . ఈ సినిమాకి దర్శకత్వం శశికిరణ్ తిక్క వహించారు మరియు సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జి మహేష్బాబు ఎంటర్టైన్మెంట్ కలయికలో `మేజర్` అనే భారీ చిత్రం రూపొందించారు. సంగీతం శ్రీ చరణ్ పాకాల అందించారు.
കൂടുതല് കാണാം
దేశభక్తిని ఆవిష్కరించిన అత్యుత్తమ తెలుగు సినిమాలు-మేజర్/top-listing/best-patriotic-movies-in-telugu-6-160.html#major
16
సీతా రామం సినిమా రొమాంటిక్, వార్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హను రాఘవపూడి వహిస్తున్నారు. నిర్మాతలు స్వప్న దత్త్, ప్రియాంక దత్త్ కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం విశాల్ చంద్ర శేఖర్ అందించారు.
കൂടുതല് കാണാം
దేశభక్తిని ఆవిష్కరించిన అత్యుత్తమ తెలుగు సినిమాలు-సీతా రామం/top-listing/best-patriotic-movies-in-telugu-6-160.html#sita-ramam
Disclaimer
The images featured on this page are sourced from publicly available platforms, official press releases, and promotional materials. These images are published strictly for editorial, informational, and news reporting purposes under the principles of fair use.
We do not claim ownership of any images unless explicitly stated. All image copyrights belong to their respective photographers, production houses, or copyright holders.
If you are the rightful owner of any image and believe that its use on this website is unauthorized or objectionable, please contact us ([email protected]) with proper details. We will promptly review and remove the content if required.